

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రక టించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచారని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. రెండవ సంవత్సరం ఫలితాల్లో 85% మొదటి సంవత్సరం ఫలితాల్లో 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. బైపీసీలో రెండవ సంవత్సరం 1000/972 మార్కులు సాధించి పెండ్యాల రాజ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారన్నారు.రెండవ స్థానంలో యు సుసానే రాణి 1000/928,మూడోవ స్థానంలో పెండ్యాల మేరీ సునంద 1000/920 మార్కులు సాధిం చారన్నారు. రెండవ సంవత్సరం ఎంపీసీ లోను, మొదటి సంవత్సరం ఎంపీసీ బైపీసీ లోను కూడా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణుల య్యారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆయన అభినందించారు.