

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 11: నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేకుండా పేదల కాలనీలకు విద్యుత్ మీటర్లను మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(యం) బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఏఈ మేరీ షర్మిల కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీను మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాలైన సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతి బస్ కాలనీ మరియు తదితర కాలనీలు ఏర్పడక మునుపు ఆ ప్రాంతాలన్నీ నివాసానికి యోగ్యం కాకుండా ఉండి రాళ్లు, రప్పలు,కొండతిప్పలు,విష సర్పాలు సంచరిస్తున్న అడవిని తలపిస్తున్న ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలందరూ గుడిసెలు వేసుకొని అక్కడే స్థిరనివాసాలు ఉంటూ కూలీనాలీ చేసుకుని జీవించసాగి దాదాపు 20 సంవత్సరాల పైబడి అవుతున్నదని,సదరు కాలనీలలో నివాసము ఉన్నవారికి పట్టాలు మంజూరు చేయక పోయినప్పటికీ అక్కడే స్థిరంగా నివాసముంటూ అసౌకర్యాల నడుమ మౌలిక వసతులు లేకున్నప్పటికీ అనేక ఇబ్బందులను ఎదుర్కొనొచ్చు జీవనం సాగిస్తున్నారని, ప్రస్తుతం బద్వేలు పట్టణంలో విద్యుత్ మీటర్ల మంజూరు కొరకు నూతన పద్ధతి ప్రవేశపెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా నివాసమున్న ఇంటికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తున్నడంతో గడిచిన 20 సంవత్సరాలుగా పేదల కాలనీలలో నివాసమున్న వారికి మీటర్లు అందడం లేదని,విద్యుత్ మీటర్లు లేని వారు చుట్టుపక్కల ఇండ్ల నుండి కరెంటు సౌకర్యం తీసుకొని మరియు గత్యంతరం లేక లైన్ పై తీగలు తగిలించారనే నెపంతో విద్యుత్ అధికారులు రైడింగ్ పేరుతో పేదల కాలనీలలో రైడింగ్ చేసి నివాసమున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారిపై కేసులు విధిస్తామని బెదిరించి, వేలాది రూపాయలు అపరాధ రుసుములు విధించడం తగదన్నారు. ఇప్పటికైనా శివారు ప్రాంతాలైన పేదల కాలనీలలో నివాసం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో ఆలోచించి స్థిరంగా నివాసాలు ఉన్న వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా విద్యుత్తు మీటర్లు మంజూరు చేయాలని లేనిపక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ముడియం చిన్ని, షేక్ మస్తాన్ షరీఫ్, చెప్పలి సుబ్బరాయుడు, షేక్ కైరున్ బీ, పసుపుల మోక్షమ్మ, శాఖా కార్యదర్శులు పి.సి కొండయ్య, మూర ప్రసాద్, షేక్ మస్తాన్ బీ,షేక్ ఆదిల్ పార్టీ కార్యకర్తలు నాగార్జున,గంప సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, బాలస్వామి, చంద్రకళ, అరుణ, సిద్ధమ్మ,పీరయ్య, శ్రీనివాసులు,ఫాతిమా, వెంకటపతి,బాబయ్య,యువరాజు, తదితరులు పాల్గొన్నారు.