

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న టెక్కిరైడ్ చలివేంద్రాలు.
మనన్యూస్,ఎల్ బి నగర్:టెక్కిరైడ్ గత 5 సంవత్సరాలుగా కొత్తపేట, మందమల్లమ్మ బస్స్టాప్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. టెక్కిరైడ్ సభ్యులు మంచి సేవ దృక్క్పధంతో చల్లటి మజ్జిగ మరియు మంచి నీరు తమ చలివేంద్రాలు ద్వారా అందిస్తున్నారు. ఈ సంవత్సరం రాగన్నగూడా బస్ స్టోప్లో కూడా తమ సేవలను విస్తరించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న
టీఎస్ ఆర్టీసీ ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్
వెంకట నర్సప్ప టెక్కిరైడ్ సేవలను విశేషంగా ప్రశంసించారు. ప్రజలందరూ కూడా ప్రజారవాణాని అధికంగా వినియోగించుకొని అవసరమైన మేరకు మాత్రమే సొంత వాహనాలను నడుపుతూ పొల్యూషన్ శాతాన్ని తగ్గిస్తే కొంత మేర పర్యావరణాన్ని కాపాడగలం అని అభిప్రాయపడ్డారు.
అలానే, తుర్కయాంజల్ మున్సిపాలిటీ లో ప్రముఖులు మర్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టెక్కిరైడ్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా విస్తరించి అందరికి ఆదర్శంగా ఉండాలి అని ప్రశంసించారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొని ఈ మంచి కార్యక్రమాన్ని అభినందించారు. టెక్కిరైడ్ సభ్యులు మాట్లాడుతూ…ఈ సంవత్సరం తమ సేవా కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ నాల్గోవ చలివేంద్రం తెరవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అని చెప్పారు. త్వరోలోనే 5వ చలివేంద్రం యల్.బి.నగర్ డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్లో కూడా TSRTC సహకారంతో మరో చలివేంద్రం తెరవబోతున్నట్లు తెలిపారు. అన్ని చోట్ల ఒక వర్కర్ సమక్షంలో శుద్ధమైన నీరుని అలానే షుమారు 300+ లీటర్ల మజ్జిగను, షుమారు 1500+ లీటర్ల మంచి నీరును ప్రతిరోజు అందిస్తున్నాము అని తెలిపారు. ఈ జలదానంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మరో సభ్యుడు నవీన్ వల్లోజు మాట్లాడుతూ నగర వాసులు రాబోయే వర్షాకాలానికి తమ ఇండ్లలో ఇంకుడు గుంతలను నిర్మించి ప్రతి వర్షపు బొట్టుని కాపాడి భూగర్భ జలాలను పెంచాలి అని సూచించారు.
ఈ కార్యక్రమములో టెక్కిరైడ్ సభ్యులు, నవీన్ వల్లోజు, వెంకట్ ఇంజుమూరి, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య, రాహుల్ శర్మ , సమత రెడ్డి, బంగాళ నవీన్ కుమార్ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
