

మన న్యూస్,నిజాంసాగర్,పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు సయ్యద్ ఇస్మాయిల్ పటేల్ మాట్లాడుతూ..మల్లప్ప పటేల్ కుటుంబం వంశపారంపర్యంగా గత వందేళ్ళుగా క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందు ఇస్తోందని తెలిపారు.ఆ కుటుంబాన్ని అల్లా ఆనందంగా ఉంచాలని ప్రార్థించారు.మల్లప్ప పటేల్ కుటుంబం ఇఫ్తార్ విందులే కాకుండా ప్రతి సంవత్సరం బసవేశ్వరజయంతి,హనుమాన్ జయంతి,ఎడ్ల పొలాలు,దసరా ఉత్సవాలు నిర్వహించి అన్నదానం చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ రసూల్ పటేల్ ,సయ్యద్ షఫీ పటేల్, సయ్యద్ మహేబూబ్ పటేల్,ఫకీర్ శాదుల్ సాబ్, సమ్మద్ పటేల్,మహ్మద్ పటేల్, రషీద్ పటేల్ , చౌటకురి శంకర్, ఆకులనాగన్న,రాంచందర్,సాయిలు,పాండు నాయక్,బార్థ్యానాయెక్ తదితరులు పాల్గొన్నారు.
