

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలను నిర్వహించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సూచించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మత్స్య కార్మికుల సమావేశంలో శ్రీపతి మాట్లాడారు..నిజాంసాగర్ ప్రాజెక్టు కింద సుమారు 40 గ్రామాలకు చెందిన 2,300 మంది మత్స కార్మికులు ఉన్నారని తెలిపారు.వారి జాబితాను పరిశీలించి వెంటనే ఎన్నికలు నిర్వహించుకుంటే మత్స కార్మికులకే లాభం చేకూతుందని చెప్పారు. సమావేశంలో ఎఫ్డీవో డోలీ సింగ్ మత్స్య కార్మికులు పాల్గొన్నారు.
