మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తారు.బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.బైక్ అతివేగం వలన యువకులు,ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా యువత పట్టించుకోవడం లేదు. యువకులు నిత్యం రోడ్డుపై హంగామా సృష్టిస్తున్నా. పోలీసులు మాత్రం చలాన్లకే పరిమితం చేస్తున్నారు. పట్టణం లో బైక్ ఓవర్ డ్రైవింగ్ మితిమీరాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా యువత బైక్ రేస్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద తిరిగే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏలేశ్వరం ప్రాంతాల్లో బైక్ లతో యువకులు రెచ్చిపోయారు. కొంతమంది యువకులు వేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. యువత తమ బాధ్యతగా మైన జీవితాన్ని పనంగా పెట్టి విన్యాసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. యువకులు 100 నుండి 150 కి.మీ వేగంతో అత్యంత వేగంగా రోడ్లపై స్పీడ్ పెంచి తో విపరీతమైన సౌండ్ లు చేస్తూ వాహనదారులకు,ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నారు.బైక్ నడుపుతున్న వారందరూ మైనర్లు ఉండటం గమనార్హం.బైక్ నడుపుతున్నవారికి 18 ఏళ్లు కూడా నిండినట్లు లేదని, వారంతా మైనర్ బాలురు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయినా వారందరూ బైక్ ను 150 స్పీడ్ తో నడుపుతూ వాహనదారులకు భయభ్రాంతులకు గురి చేస్తుంన్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో(కాలేజీ రోడ్డు లో, మెయిన్ రోడ్డు లో, డిగ్రీ కాలేజ్ ప్రాంతాల్లో, లేడీ హాస్టల్ వద్ద,) నిఘా ఉంచాలని కోరుతున్నారు. సాయంకాల సమయంలో బైక్ సైలెన్సర్ తీసివేసి మెయిన్ రోడ్ లో పెద్ద పెద్ద సౌండ్స్ తో రావడంతో రోడ్లపై వెళ్లే ప్రజలను బయటికి రావాలంటే ఏం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బైక్ లు నడిపే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *