

మనన్యూస్,తిరుపతి:నూతనంగా ఎన్నికైన స్విమ్స్ ఉద్యోగుల నూతన కార్యవర్గం స్విమ్స్ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పాటు పడదామని స్విమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రం రెడ్డి తెలిపారు. స్విమ్స్ ఆడిటోరియం లో మంగళవారం స్విమ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రం రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న కార్యవర్గం కన్నా మరింత చురుకైన పాత్ర పోషించి అటు ఉద్యోగుల సంక్షేమంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి రోగులకు మెరుగైన వైద్యం అందించేలా తమ వంతుగా కృషి చేయాలన్నారు. అనంతరం సిమ్స్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి. బాబు సురేష్, పి రామమూర్తిలు మాట్లాడుతూ తమను నూతన కార్యవర్గంలో చోటు కల్పించడం పట్ల స్విమ్స్ ఉద్యోగ సంఘం సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సిమ్స్ లో పనిచేసే ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా మన అసోసియేషన్ ఎప్పుడు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే దాకా పట్టు వదలని విక్రమార్కుడి లాగా మీ అందరి సహకారంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా సర్వ చూపుతామన్నారు. సిమ్స్ కు రాయలసీమ జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి రోగులు వైద్యం కోసం వస్తున్నారని వారందరిని ప్రేమ పూర్వకంగా ఆదరించి మెరుగైన వైద్యం అందేలా చొరవ
చూపుతామన్నారు. కోశాధికారి గోవర్ధన్ మాట్లాడుతూ త్వరలో జమా ఖర్చుల నివేదికలను అసోసియేషన్ ముందు ఉంచుతామని చెప్పారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా డిప్యూటీ డైరెక్టర్ సురేష్ ను ఎంపిక చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు శివయ్య, జాయింట్ సెక్రటరీలుగా రూపా నాయక్, సురేష్ కుమార్ రెడ్డి, రమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్ ఎస్ ఆర్ మురళీకృష్ణ, కమ్యూనికేషన్ సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
