

మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు )113వజయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద ఆయన విగ్రహానికి సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బిసి సామాజిక వర్గానికి చెందిన
సివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ను మించిన) ఉన్నత విద్య పూర్తి చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని కాకినాడ పురపాలక కౌన్సిలర్గా, చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజాహిత ప్రయోజన ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో కమ్యూనిస్ట్ గాంధీగా నిస్వార్థ సేవలందించిన దేశభక్తుడని రమణరాజు పేర్కొన్నారు. చైర్మన్గా ఎమ్మెల్యేగా ఏకకాలంలో రెండు ఉన్నత పదవులు నిర్వహించిన ఏకైక ప్రజానేతగా ఖ్యాతి చెందారన్నారు. కాకినాడ జగన్నాధపురం ఉప్పుటేరు మీద నిర్మించే మూడవ వంతెనకు సివికె రావు వారధిగా నామకరణం చేయాలని రమణ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
