మన న్యూస్ (జామి) ; జామి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం నాడు శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వబ్బెన సత్యనారాయణ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ… మార్చి 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతుందని అందుచేత జనసేన పార్టీ, నాయకులు, కార్యకర్తలు , యువత మరియు ప్రజలందరూ తరలి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జామి మండల నాయకులు పెనుమత్స వెంకటరమణ వర్మ, మూలవలస శ్రీను, కాశి, వారాది స్వామి నాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *