

బంగారు పాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన ఫిరోజ్ అహ్మద్( అన్ను ) మండల కో- ఆప్షన్ నెంబర్ ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా శుక్రవారం నియమితులైయ్యారు. పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు గా కూడా పని చేశారు. షేక్ ఫిరోజ్ అహ్మద్ సేవలను గుర్తించిన రాష్ట్ర కార్యవర్గం చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా ఎన్నుకున్నారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సమాజ సేవతో గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయం లో కోవిడ్ మృతదేహలకు దహనక్రియలు చేసి తమకు తమ టీంకు మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా మృతదేహాలకు బంగారుపాళ్యం సిఐలు పోలీసులు కూడా ముస్లిం ఐక్యవేదిక కు ఎంతో తోడ్పడ్డారు. ప్రస్తుతం కూడా అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహిస్తూ మండలంలోని శభాష్ అనిపించుకున్నారు. అనాధలుగా బిక్షాటన చేసే వారిని చూసి వారికి కటింగ్ షేవింగ్ చేయించి,స్నానాలు చేయించి బట్టలు ధరించి వారికి భోజన సౌకర్యం కల్పించి కొంతమందిని అనాధాశ్రమంలో చేర్పించి సమాజంలో కన్ను తెరిపించేలా, వారిలో సమాజం గుర్తుపట్టేలా కూడా చేసి అందరి చేత మన్ననలను పొందారు. తమ సేవల పట్ల వెన్నంటే ఉండి తమకు సహకరించిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు