

మనన్యూస్,నాగోల్:బండ్ల గూడ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త .
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతల ఆగ మలయ్య యాదవ్ చింతల కిరణ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.