గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చిందిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ తో రాష్ట్రానికి ఎంతో మేలు జ‌రుగుతోందని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధన్య‌వాదాలు తెలిపే తీర్మాణంపై చ‌ర్చ‌లో భాగంగా మంగ‌ళ‌వారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు మాట్లాడారు.గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం రాష్ట్ర ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్పించింద‌న్నారు.93 కేంద్ర‌ ప‌థ‌కాల‌ను గ‌త ప్ర‌భుత్వం నిలిపివేయ‌గా 74 ప‌థ‌కాల‌ను ఎనిమిది నెల‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పున‌రుద్ధ‌రించార‌ని ఆయ‌న చెప్పారు.ఆంధ్రుల జీవ‌నాడైన పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రుగులు పెట్టిస్తున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కింద‌ని ఆయ‌న తెలిపారు.రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంను తిరిగి ప‌ట్టాలెక్కించిన ఘ‌త‌న చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కింద‌ని ఆయ‌న‌కు కృత‌జ్జ‌త‌లు ఎమ్మెల్యే తెలిపారు.పేద‌ల కోసం ఐదు రూపాయ‌ల‌కే భోజనం అందించే అన్నా క్యాంటీన్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం చంద్ర‌బాబు నాయుడు ఘ‌న‌త‌గా ఆయ‌న చెప్పారు.రైతుల‌కు నాణ్య‌మైన విద్యుత్ అందించ‌డ‌మే కాకుండా పిఎం సూర్య ఘ‌ర్ ప‌థ‌కాన్ని పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తున్న ఘ‌న‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిదే అని ఆయ‌న తెలిపారు.డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని 13,326పంచాయితీల్లో ఒకేసారి స‌భ‌లు నిర్వ‌హించి రికార్డ్ సృష్టించార‌ని ఆయ‌న కొనియాడారు.4,800 కోట్ల‌తో గ్రామాల్లో సిసి రోడ్లు వేసిన ఘ‌న‌త ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌న్నారు.చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ మిగిలార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చెత్త ప‌న్ను ఎత్తివేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.జ‌ల‌జీవ‌న్ మిష‌న్ నిధుల‌ను గ‌త ప్ర‌భుత్వం ప‌క్క‌దోవ ప‌ట్టించ‌గా డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో 22వేల కోట్ల రూపాయ‌లు వినియోగంకు గ‌డ‌వు కేంద్రం పొడిగించింద‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి స‌మ ప్రాధాన్య‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇస్తూ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామీని ప్ర‌భుత్వం నెరవేరుస్తుంద‌న్న భ‌రోసా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప్ర‌జ‌ల‌కు ఇచ్చింద‌ని ఆయ‌న చెప్పారు.

  • Related Posts

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ముద్రగడ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్ కొత్తిం బాలకృష్ణ తండ్రి శ్రీరామ్మూర్తి ఇటీవల కాలంలో మరణించడంతో వారి కుటుంబాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 2 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…