మనన్యూస్,తిరుపతి:డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చలో భాగంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించిందన్నారు.93 కేంద్ర పథకాలను గత ప్రభుత్వం నిలిపివేయగా 74 పథకాలను ఎనిమిది నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ధరించారని ఆయన చెప్పారు.ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఆయన తెలిపారు.రాజధాని అమరావతి నిర్మాణంను తిరిగి పట్టాలెక్కించిన ఘతన చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఆయనకు కృతజ్జతలు ఎమ్మెల్యే తెలిపారు.పేదల కోసం ఐదు రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం చంద్రబాబు నాయుడు ఘనతగా ఆయన చెప్పారు.రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కాకుండా పిఎం సూర్య ఘర్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన తెలిపారు.డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని 13,326పంచాయితీల్లో ఒకేసారి సభలు నిర్వహించి రికార్డ్ సృష్టించారని ఆయన కొనియాడారు.4,800 కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్లు వేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు.చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ మిగిలారని ఆయన విమర్శించారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను ఎత్తివేసిందని ఆయన గుర్తు చేశారు.జలజీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవతో 22వేల కోట్ల రూపాయలు వినియోగంకు గడవు కేంద్రం పొడిగించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందన్న భరోసా గవర్నర్ ప్రసంగం ప్రజలకు ఇచ్చిందని ఆయన చెప్పారు.