

ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.శ్యాంసుందర్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
మనన్యూస్,పినపాక:నియోజకవర్గంలో మణుగూరు ఏరియా ఎక్స్ ప్లోజివ్ విభాగం ఎస్ఎంఎస్ ప్లాంట్ లో సింగరేణి ఎండి ఎన్ బలరాం ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని భూనిర్వాసులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు ఏరియా ఎస్ఓడి జిఎం డి శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియా ఎస్ఎంఎస్ ప్లాంట్ ,(ఎక్స్ ప్లొజివ్స్) విభాగం కాంట్రాక్టర్ శ్రీనివాస్ గోదావరిఖని మరో కొద్ది రోజుల్లో టెండర్ ముగియనుంది.ఈ మధ్యకాలంలో సుమారు పదిమంది వరకు కాంట్రాక్ట్ కార్మికులను, కొత్తగా వచ్చిన సింగరేణి ఎక్స్ ప్లొజివ్ క్యారియర్స్ డ్రైవర్ లను నియమించుకున్నారని.కాంట్రాక్ట్ కార్మికులు గా నియమించుకున్న వారిలో సింగరేణి భూనిర్వాసితులు(పిడిఎఫ్)లు ఇద్దరు లేదా ముగ్గురు మించి లేరని అది కూడా ముగ్గురు మహిళలు మాత్రమే ఉన్నారని మణుగూరు ఓసి విస్తరణలో భూములు కోల్పోబోతున్న తిర్లా పురం గ్రామస్తులు అసలు లేనేలేరన్నారు.ఈ విషయమై గతంలో కూడా నేను ఏరియా యాజమాన్యానికి,ఎస్ఎంఎస్ ప్లాంట్ సింగరేణి అధికారులకు,సంబంధిత కాంట్రాక్టర్ కి కూడా వినతి పత్రాలు అందజేసి ఉన్నానని.ఈ విషయమై ఆరా తీయాలని అక్కడ అధికారులను కలిసి వివరణ అడగాలని ఎస్ఎంఎస్ ప్లాంట్ కి ఎప్పుడు వెళ్లిన అక్కడి ప్రస్తుత ఇన్ చార్జ్ నన్ను ఒక దళితుడు,పాత్రికేయుడు అని కూడా చూడకుండా నోరు జారుతున్నారని సెక్యూరిటీ వాళ్ళ ముందు చులకనగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు.సింగరేణిలో దొంగతనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు యాజమాన్యానికి ఇవ్వడం నేను చేసిన తప్పా అవకతవకలను బయట తీయడం తప్పా ఇంచార్జ్ గారే చెప్పాలని ఆయన నిలదీశారు అదేవిధంగా నిర్వాసితులను కాదని కొత్తగా ఎంతమంది ఎలా పనిలోకి చేరారని.ఇన్ ఛార్జ్ కాంట్రాక్టర్ సూపర్వైజర్ ని ఇద్దరిని మెప్పిస్తే ఓకేనా రేపు గ్రామసభల ప్రజాభిప్రాయ సేకరణలో వీళ్ళిద్దరూ విస్తరణకు అనుకూలంగా గ్రామస్తులను ఒప్పిస్తారా ఈ విషయమై ఏరియా యాజమాన్యం దృష్టిపెట్టాలని డీజీఎంఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్ ప్లోజివ్ క్యారియర్ డ్రైవర్లుగా ప్రత్యేకంగా శిక్షణ పొంది సంబంధిత సర్టిఫికెట్ కూడా ఉండాలని ఇవేవీ లేని వారిని బయట బొలెరో ఇలాంటి చిన్న వాహనాలు లైట్ వెహికల్స్ నడిపించే వారిని భారీ వాహనాలపై ఎలాంటి శిక్షణ లేకుండా డ్రైవర్లుగా నియమిస్తే అనుకోని అవాంతరం ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా ఏరియా జిఎం దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.