

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం,సింగిరెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి మండలాల మున్నూరు కాపు సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో భాగంగా మున్నూరు కాపు జనాభాను తక్కువ చూపించడం,తెలంగాణ రాష్ట్ర జనాభాలో 40 లక్షల పైచిలుకు ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో తక్కువ సంఖ్యలో చూపించటం,బీసీ జనాభాలో అత్యల్ప సంఖ్యను సభలో ప్రకటించటం మమ్మల్ని విస్మయానికి గురి చేసిందని,2000,2014 సంవత్సరాలలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న బీసీ జనాభా ఇప్పుడు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని,జనాభా సంఖ్య పెరగకుండా తగ్గటాన్ని గమనిస్తే కుల గణన సర్వేపై అనేక అనుమానాలకు దారితీస్తుందని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ సర్వే చేపట్టి చిత్తశుద్ధితో మా మున్నూరు కాపు జనాభా సంఖ్యను ప్రకటించాలని లేకపోతే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘo ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక కరకగూడెం ఉమ్మడి మండలాల మున్నూరు కాపు సంఘం నాయకులు పోతునూరి కొండయ్య,బొడ్డు నాగేశ్వరరావు,గారే దుర్గయ్య,గుండారపు.వెంకటేశ్వర్లు,సింగారపు నాగేశ్వరరావు,బొడ్డు హరిబాబు,రోడ్డ సాంబశివరావు.ఆళ్ల సాయి హనుమంతుల.నిఖిల్ హనుమంతుల.గంగయ్య కొమ్మరాజు,పుల్లారావు పాల్గొన్నారు.