మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ న్యూ నాగోల్ రాఘవేంద్ర కాలనీ లో విశాల్ సూపర్ మార్కెట్ కి సమీపంలో బిల్లుపల్లి నవీన్,బిల్లుపల్లి పిచ్చిరెడ్డి నేతృత్వంలో బెలూన్స్ డెకొర్జ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా కొత్తపేట కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్,మేడ్చల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ కోటిరెడ్డి హాజరయ్యారు.అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ నాల్గవ బ్రాంచ్ అని,అన్ని రకాల పార్టీలకు సంబంధించిన బెలూన్స్ డెకొరేషన్ ఐటమ్స్ అందరికి అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు.డెకరేటివ్ ఐటమ్స్ తో పాటు బర్త్ డేస్కి,ఫంక్షన్స్ కి డెకరేషన్స్ కూడా చేయబడునన్నారు.ఈ కార్యక్రమంలో మోహన్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్రాంరెడ్డి,కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *