

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న కార్యక్రమాలు బుధవారం రోజు ప్రతిష్ట కానున్న విగ్రహాలకు జలాభిషేకం చేయడానికి వాసవి కుటుంబ సభ్యులు సతి సమేతంగా ఏక వస్త్రధారణతో ఆర్య వైశ్యులు ప్రతి ఇంటి నుండి ఒక సర్వలో పవిత్ర గంగ జలాన్ని తీసుకొని గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గ్రామంలో గల్లి గల్లి తిరిగి తీసుకొని గుడి వద్దకు పోయి నూతన విగ్రహాలకు ప్రతి ఒక జంటతో జలభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు మరియు వాసవి ఆర్యవైశ్య సభ్యులు సతీ సమేతంగా అందరూ పాల్గొనడం జరిగింది.
