

మనన్యూస్,గొల్లప్రోలు: ఫిబ్రవరి 24 వ తారీఖు నుండి దేశ రాజధాని ఢిల్లీ లో జరిగే ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్సు 11వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని గొడుగు సత్యనారాయణ పిలుపు ఇచ్చారు.గొల్లప్రోలు లో ఆయన యూనియన్ కరపత్రాలు పంచుతూ భారీ ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా గొడుగు మాట్లాడుతూ కేంద్రం లో అధికారం సాగిస్తున్న బిజేపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు నిరాశ మిగిల్చందన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమాంతం పెరిగిన నిత్యావసర ధరలు, ఉపాధి హామీ పథకం నిధులు పెంచక పోవడం మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు.అనంతరం లిబరేషన్ పార్టీ సిపిఐ( ఎంఎల్) ర్యాలీ నిర్వహించారు.అనంతరం కరపత్రాలు పంచుతూ 11 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐప్వా జిల్లా నాయకురాలు కాకర కుమారి లిబరేషన్ పార్టీ సభ్యులు నక్కా అప్పన్న,కన్నడ వెంకట రమణ,తంగెళ్ళ లక్ష్మి,బత్తిన అప్పారావు,యూనియన్ నాయకులు తంగెళ్ళ శ్రీనివాస్ రావు,రాజబ్బాయ్,నాగేశ్వరరావు,తాతారావు,నూకరాజు సత్యవతి మరియమ్మ మహాలక్ష్మి రామయమ్మ తదితరులు పాల్గొన్నారు.