

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు మండలానికి చేసిన సేవలు ఎనలేనివని ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి కొనియాడారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలేశ్వరం ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, వైస్ ఎంపిపి చిక్కాల రాజ్యలక్ష్మి లక్ష్మణరావులు హాజరయ్యి తహశీల్దార్ కు శాలువలతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి గొల్లపల్లి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని ,మీరు చేసిన సేవలు ఎంతో ఘననీయమని మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.విజయ్ బాబు, ఎంపీటీసీ కొప్పుల బాబ్జి, రెవిన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.