

పూతలపట్టు జనవరి 24 మన న్యూస్
శుక్రవారం సాయంత్రం మన జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భముగా, పూతలపట్టు మండలం, గల్లా ఫుడ్స్ కంపెనీ వారిచే జాతీయ వారోత్సవాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడిగా మంగల్ ఇండస్ట్రీస్, అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, గల్లా ఫుడ్స్ సంస్థ పూతలపట్టు పోలీస్ వారి సహకారంతో పూతలపట్టు సిక్స్ లైన్ రహదారి నుంచి గల్లా ఫుడ్స్ ప్రాంగణం వరకు భద్రత ప్రమాణాలను ప్రజలకు మరియు వ్యక్తిగతంగా అవగాహన పెంపొందించుకుంటూ రోడ్ సేఫ్టీ ర్యాలీ ద్వారా గల్లా ఫుడ్స్ ప్రాంగణం నందు సదస్సు ప్రదేశానికి చేరుకుని ఈ భద్రత వారోత్సవాలని దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది.
ఈ రహదారి భద్రత వారోత్సవాల క్యాంపెయిన్ తర్వాత ప్రాంగణంలో సదస్సు నిర్వహించి భద్రత ప్రమాణాల గురించి 10 గోల్డెన్ సేఫ్టీ రూల్స్ గురించి కులంకషంగా చర్చించుకుని ముఖ్య అతిథులు పూతలపట్టు సీఐ కృష్ణమోహన్ గారు, గల్లా ఫుడ్స్ బిజినెస్ హెడ్ శ్రీరామ్ గారు, అమరారాజ సస్టైనబిలిటీ హెడ్ ప్రశాంత్ తివారి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డీన్ రవికుమార్ పలు సూచనలు తెలియజేసి సహ ఉద్యోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం జరిగినది, ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంస పత్రాన్ని అతిధుల చేతుల మీదుగా అందించడం జరిగినది.
