

మన న్యూస్,తిరుపతి:తిరుపతి ఫిబ్రవరి 15 వరకు 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్బ్యా నర్లు,కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం అమలు చేయవలసిన నిబంధనలకు సంబందించిన రహదారి భద్రత, హెల్మెట్ ధారణ, రహదారి నియమ నిబంధనల ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ చాంబర్ నందు జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు రవాణా శాఖ వారిచే నిర్వహించనున్న 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2025 నిర్వహణకు సంబంధించి గోడపత్రికలు, బ్యానర్లు, కరపత్రాలను రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తో కలిసి జిల్లా కలెక్టర్ విడుదల చేసారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మోటర్ వాహనాల నిబంధనలకు సంబంధించి ద్విచక్ర వాహనం,నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, చిన్న, మధ్య, భారీ వాహనాలు డ్రైవింగ్ చేయునప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని,డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, అధిక బరువు తీసుకెళ్లటం,అతివేగంగా వెళ్లడంపై తదితర అంశాలపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యవంతులుగా చేసి ప్రమాద రహిత డ్రైవింగ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా డ్రైవర్లు ముందుకు వెళ్ళేలా చూడాల్సిన బాద్యత సంబందిత అధికారులైన రవాణా,పోలీసు శాఖల పై ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈరోజు నుంచి 15-02-2025 వరకు నిర్వహించబోయే రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా జాగ్రత్తగా పర్యవేక్షించాలని రవాణాశాఖ అధికారి మురళీమోహన్ ను కలెక్టర్ ఆదేశించారు.
36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ప్రధాన శీర్షికగా రహదారి భద్రత ప్రచారం శ్రద్ధ వహించండి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తదనుగుణంగా రహదారి భద్రతపై పలు రకాల వాహనదారులకు మరియు కాలేజీ విద్యార్థులకు మోటార్ వాహనాల నిబంధనల అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తామని కలెక్టర్ కు జిల్లా రవాణా అధికారి శాఖ అధికారి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం,మోహన్ కుమార్,ఆంజనేయ ప్రసాద్,వెంకటరమణ నాయక్,ఆంజనేయవర్మ,పరిపాలన అధికారి శ్రీనివాసులు సంబందిత అధికారులు పాల్గొన్నారు.