గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం అందజేత

మనన్యూస్,నిజామాబాద్:యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన రాజా కుటుంబ సభ్యులు గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55,లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి అందజేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్ జిల్లా,భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజా 2022 డిసెంబర్ 27 న షార్జలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండస్ట్రియల్ ఏరియాలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతుండగా పాకిస్తాన్ కు చెందిన వాహనదారుడు ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే గద్దల రాజా ను షార్జా ఆల్ ఖాసిమియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందడం జరిగింది.మరణించిన గద్దల రాజా పై రహదారి దాటినందుకు అభియోగం మోపడం ద్వారా కేసును ముగించారు.ఆ సమయంలోనే గద్దల రాజా అతని బంధువైన రాజారాం,గద్దల రాజన్న వారసులు యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరికి కేసును అప్పగించడం జరిగింది. రోడ్డు దాటుతున్న పాదదారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేశారు.దీంతో షార్జ కోర్టులో తిరిగి కేసు నమోదు చేయడం వల్ల యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు చేసిన కృషి ఫలింతంగా రాజు కుటుంబానికి నష్టపరిహారం అందజేశారు.ఈ సందర్భంగా యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిసిపిరిని నిజామాబాద్ జిల్లాలోనీ జ్యాగిర్యాల్ విచ్చేసి మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి గత 15 సంవత్సరాలుగా మాయబ్ లీగల్ సర్వీసెస్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూదన్నారు.న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నామని,సగటు భారతీయుడికి సౌదీ, అరబ్, ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వారు యబ్ లీగల్ సర్వీసెస్ కు ఆశ్రయించిన మరో క్షణం నుంచి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామన్నారు.

  • Related Posts

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.పెద్ద కోడప్ గల్…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్