మన న్యూస్,శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతున్నది.నగరంలోని మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేసింది.అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు భారీగా మోహరించారు.అక్రమ నిర్మాణమని తేల్చిన జీహెచ్‌ఎంసీ భవన యజమానులకు గతేడాది నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే హైకోర్టు కూడా దానిని అక్రమ నిర్మాణమని నిర్ధారించింది.ఈ నేపథ్యంలో ఆదివారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భవనాన్ని పరిశీలించారు.ఈ క్రమంలో ఆదివారం కూల్చివేత చేపట్టారు.భవనం మెయిన్‌ రోడ్డు పక్కనే ఉండటంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *