• ప్రత్యర్థులు 13 మంది పై ఘనవిజయం సాధించిన కోన రాధిక
  • ప్రజల నమ్మకం ఓట్లగా మలచుకుని ప్రమాణ స్వీకారం చేసిన కోన రాధిక…

విశాఖ మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 24: జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలుగా కూటమి ప్రభుత్వ సహకారం తో జనసేన పార్టీ తరఫునుంచి 95 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగిన కోన రాధిక. స్వతంత్ర అభ్యర్థులు,వైయస్సార్ సిపి అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 700 ఓట్ల మెజార్టీతో 95 వార్డు నుండి కూటమి బలపరిచిన కోన రాధికాకు విజయం దక్కింది.ప్రజల నమ్మకం కూటమి ప్రభుత్వపై పాలనా వ్యవస్థ కలిసి అత్యధిక మెజార్టీతో 95వ వార్డు నుంచి గెలుపొందడం జరిగింది. సమావేశ మందిరంలో 95 వ వార్డు కార్పొరేటర్ కోన రాధిక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒకానొక సమయంలో డిప్యూటీ మేయర్ రేసులో కూడా తన పేరు రావడం ఎంతో శుభ పరిణామంగా ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వ తరపున మేయర్ అభ్యర్థిగా మొక్క శ్రావణి గెలుపొందడంతో అదే రేసులో మహిళలకి ప్రాధాన్యత ఇస్తారు అనుకున్న సమయంలో ఉన్నప్పటికీ జనసేన పార్టీ అధిష్టానం మాత్రం సమ పాలన యోజనా పరంగా డిప్యూటీ మేయర్ పదవి పివి శివప్రసాద్ కు దక్కింది కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ బలపరిచే విధంగా కోనా రాధిక కూడా పూర్తి మద్దతు పలకడంతో డిప్యూటీ మేయర్ గా జనసేన పార్టీ తరఫున నుంచి పివి శివప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కౌన్సిల్ సమావేశం తదనంతరం బయటకు వచ్చిన తర్వాత జీవీఎంసీ ప్రాంగణంలో 95 వ వార్డు కార్పొరేటర్ కోన రాధిక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం వాటిలో నిరంతరం ప్రజల పక్షాన ఉంటానని వాటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని త్వరితగతిన పనులు పూర్తి చేస్తానని తెలిపారు ప్రధానంగా హెచ్.పీ కాలనీ గడ్డ సమీపంలో ఉన్న ఇల్లు మునిగిపోవడం నా దృష్టికి రావడం జరిగింది ఆ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి మీరు నిలవకుండా సముద్ర మార్గంలో కలిసే విధంగా చర్యలు చేపడతాం. ప్రజలకు తెలిపిన విధంగా ప్రజల వద్దన ప్రతిరోజు అందుబాటులో ఉంటానని తెలిపారు.నీరు,వీధి దీపాల సమస్య మిగిలిన సమస్యలన్నిటిపైన కౌన్సిల్లో తెలియపరచి అధికారుల చేత త్వరితగతిన ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు చేపడుతుంది ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *