నిజాంసాగర్, మన ధ్యాస, నవంబర్ 19, మా కాటేపల్లి గ్రామ అభివృద్ధి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తోనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన మానేపురం అంజవ్వ, హుండోళ్ల ఉమాభారతిలకు వితంతు పింఛన్లు మంజూరు కావడంతో గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మంజూరు పత్రాలను అందజేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.అనంతరం పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లప్ప పటేల్ మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తోనే జుక్కల్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ ఫత్రూ పటేల్, పాండు నాయక్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.