*కలిగిరి, నవంబర్ 3 మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని, జడ్పీటీసీ అభ్యర్థితో పాటు 13 మంది ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కలిగిరి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇర్ల రమణయ్య పిలుపునిచ్చారు.మంగళవారం కలిగిరిలో ఓ ప్రకటన లో ఆయన మాట్లాడుతూ… గత వైసీపీ పాలనలో కలిగిరి మండలం అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లు, తాగునీరు, పంట కాలువల సమస్యలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
*13 ఎంపీటీసీలు + 1 జడ్పీటీసీ గెలుపు మా లక్ష్యం*
ఈసారి జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కలిగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా మెట్టుకూరు శిరీషా రెడ్డి గారు పోటీ చేస్తున్నారని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించి, కలిగిరి మండలాన్ని టీడీపీ కంచుకోటగా నిలపాలని పిలుపునిచ్చారు.ప్రతి గ్రామంలో ప్రజలు సైకిల్ గుర్తుకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు.ఉదయగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న కాకర్ల సురేష్ కి బలం చేకూర్చేలా, స్థానిక సంస్థల్లో టీడీపీ జెండా ఎగరాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి” అని ఇర్ల రమణయ్య సూచించారు.