నిజాంసాగర్, (మన న్యూస్ ): రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అచ్చంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి సూచించారు.
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను
చైర్మన్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు తప్పనిసరిగా శుభ్రపరిచి, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని వివరించారు.రైతులు కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సహకరిస్తూ, నిబంధనలను పాటించి మద్దతు ధర పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి విఠల్, అచ్చంపేట్ గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, సంఘ కార్యదర్శి సంగమేశ్వర్‌గౌడ్, డైరెక్టర్ రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.