మన ధ్యాస, నెల్లూరు అక్టోబర్ 30 : వైసిపి అభ్యర్థులకు మద్దతుగా సాగిన ఎన్నికల ప్రచారం. ప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టిన ప్రజలు.నెల్లూరు చిన్న బజార్, కామాటి వీధిలో వైసిపి ఎన్నికల ప్రచారం హోరెత్తించింది. ఈ ప్రచార కార్యక్రమానికి..వైసిపి నెల్లూరు సీటి నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి హాజరైన వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి,వైసిపి 65వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఖజానా వెంకట శేషయ్య కి ప్రజలు హారతులు పట్టి తీన్మార్ డప్పులతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రజలకు నమస్కరిస్తూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.ఆ ప్రాంతంలో పలు వాణిజ్య దుకాణాలకు వెళ్లి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెసిన మేలును.. ప్రజలకు వివరించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.రాబోయే రోజుల్లో.. నెల్లూరు నగరంలో మరింత అభివృద్ధి జరగాలంటే వైసిపి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలను కోరారు.ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కార్పొరేషన్‌ను తాకట్టుపెట్టి.. అభివృద్ధి పనులు పేరుతో కార్పొరేషన్ ను లూటీ చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి జరగాలంటే.. మేయర్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ని, కార్పొరేటర్ గా ఖజానా వెంకట శేషయ్య ని గెలిపించుకుంటే.. నగర అభివృద్ధి తో పాటు ఈ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి స్టేట్ జాయింట్ సెక్రెటరీ కొనిదల సుధీర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి ,వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
‘



