తిరుపతి రూరల్ మండలం, గంగనగుంట గ్రామానికి చెందిన ఎన్. లక్ష్మి మరియు స్వర్గీయ ఎన్. నిరంజన్ నాయుడు కుమారుడు నర్రావుల భార్గవ్, పాకాల మండలం, వలపులవారిపల్లి గ్రామానికి చెందిన ఎ. వనజ మరియు ఎ. కోదండ నాయుడు గార్ల కుమార్తె అత్తులూరి దివ్య ల వివాహ రిసెప్షన్ వేడుకలు గురువారం రాత్రి వైభవంగా జరిగింది.

తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో గల శిల్పారామం కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డి నూతన వధూవరులైన భార్గవ్, దివ్యలకు అక్షింతలు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి,నూతన దంపతులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *