గాజువాక మన ద్యాస ప్రతినిధి అక్టోబర్ 26:విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, గాజువాక పోలీస్ అధికారి సి.హెచ్ వాసు నాయుడు(సి. ఐ)సూచనలతో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ కౌన్సిలింగ్ 20 మంది రౌడీ షీటర్ లను పిలిపించడం జరిగింది.ఈ సందర్భంగా వాసు నాయుడు(సి.ఐ) మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ కూడదు,ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాలి అని రౌడీషీటర్లకు తెలిపారు. ఎన్నికల జరుగుతున్న వేళ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం,గొడవలకు పాల్పడడం,శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని రౌడీషీటర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *