గాజువాక మన ధ్యాస ప్రతినిధి అక్టోబర్ 26:జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార వాహనాలను తనిఖీ చేస్తున్న గాజువాక పోలీసులు.మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ సి.హెచ్ వాసు నాయుడు ఆదేశాల జారీ చేయడం జరిగింది.పోలీసులు సిబ్బంది ఎన్నికల ప్రచార వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ప్రచార వాహనాలకు సంబంధించిన అనుమతులు,లైసెన్సులు మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలిస్తూ,ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *