రేణిగుంట:
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెంకటాపురం ఎంపీటీసీ స్థానానికి పోటీగా దాఖలై, పరిశీలనలో ఆమోదించబడిన తన నామినేషన్ను అభ్యర్థి వి . సుబ్రహ్మణ్యం అధికారికంగా ఉపసంహరించుకున్నారు.
ఈ విషయాన్ని రేణిగుంట మండల ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ( ఆర్ ఓ ) ఆదినారాయణ ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం సుబ్రహ్మణ్యం తన ఉపసంహరణ పత్రాన్ని అధికారులకు సమర్పించారని, దాని ఆధారంగా ఆయన నామినేషన్ ఉపసంహరణను నమోదు చేసినట్లు ఆదినారాయణ తెలిపారు.
దీంతో వెంకటాపురం ఎంపీటీసీ స్థానంలో పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాపై స్పష్టత రానుంది.
