నిజాంసాగర్, (మన ధ్యాస), అక్టోబర్ 17 ,నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎకో టూరిజం కాటేజీల నిర్మాణ పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలోని గోల్ బంగ్లా పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వారు సమీక్షించారు.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కృషితో నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కాటేజీల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు.పర్యాటక రంగానికి కొత్త ఊతం
ఎకో టూరిజం పనులు పూర్తయితే నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే సందర్శకులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షులు ప్రజా పండరి, సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి,నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్ ,బలరాం ,రమేష్,తదితరులు ఉన్నారు.