పులిమామిడి యాదగిరి, తాంజావూరు మునేంద్రను కలిసిన నీరుగట్టు నగేష్..

తిరుపతి అక్టోబర్ 17
ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి మేయర్ అభ్యర్థి నీరుగట్టు నగేష్ ఎన్నికల నేపథ్యంలో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు, జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పులిమామిడి యాదగిరిని, సంఘం కార్యదర్శి తాంజావూరు మునేంద్రను ఆయన కలిసి మద్దతు కోరారు.
ప్రజా ఉద్యమాల్లో అనుభవం కలిగిన నాయకులను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని నీరుగట్టు నగేష్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమకారుల మద్దతు కూడగట్టే దిశగా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ భేటీతో తిరుపతి నగర రాజకీయాల్లో ఎన్నికల మద్దతు సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. అయితే నీరుగట్టు నగేష్‌కు మద్దతుపై పులిమామిడి యాదగిరి, తాంజావూరు మునేంద్ర స్పందిస్తూ నిరంతరం విద్యార్థి యువజనల ప్రజా సమస్యలపై గళం ఎత్తి పోరాడుతున్న యువ నాయకుడు నీరుగట్టు నగేష్ తిరుపతి మేయర్ ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆశవాహం వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *