రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, సమర్థవంతమైన ఎన్నికల వ్యూహంతో ముందుకు తీసుకెళ్లే దిశగా ఈరోజు శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జనసేన పార్టీ పార్లమెంటు మరియు నియోజకవర్గ సమన్వయకర్తలు, కమిటీ సభ్యుల సమావేశం..ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అవలంబించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

అలాగే కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగుతూ, స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలు, ప్రజల్లో మంచి పేరు ఉన్న నాయకులకు ప్రాధాన్యత, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై నాయకులు తమ సూచనలు, సలహాలను అందించారు.

స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గుర్తించి ఎన్నికల బరిలో నిలబెట్టడంతో పాటు, ప్రతి గ్రామం మరియు ప్రతి వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి జనసేన పార్టీ బలాన్ని మరింత పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.

కూటమి ధర్మాన్ని పాటిస్తూ, భాగస్వామ్య పార్టీలతో పరస్పర సమన్వయం మరియు అవగాహనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్లమెంటు సమన్వయ కమిటీ సభ్యులు మిద్దెల హరి, నియోజకవర్గ సమన్వయకర్తలు కొట్టే సాయి ప్రసాద్, సత్రవాడ ప్రవీణ్, దండి నరేంద్ర, జయప్రకాష్, అంజూరు చక్రధర్ తదితరులు, అలాగే కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *