

మన న్యూస్:వెదురు కుప్పం మండలంలోని కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బీహరి వాజ్ పాయ్ 100వ జయంతి వేడుకలు ఘనంగా బిజెపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ముందుగా వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుని ఎన్నుకోవడం జరిగినది. ఎన్నికల ఇంచార్జ్ జీకే చౌదరి మరియు నియోజకవర్గం ఇంచార్జ్ రాజేంద్ర కలసి తిరుమలయ్య పల్లి పంచాయతీ, కొండ కింద పల్లి గ్రామంలో చెందిన బోడిరెడ్డి అశోక్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగినది .ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అపర రాజకీయ చాణుక్యుడని,సుపరిపాలన దక్షుడని, భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా నేషనల్ హైవే విస్తరణ అనేక రాష్ట్రాల్లో అనేక నెంబర్లతో నేషనల్ హైవే విస్తీర్ణ చేయడం ఆయనకే సాధ్యమైందని వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు ప్రభాకర్ రాజు, స్టేట్ కౌశిలిగ్ నంబర్ బోడిరెడ్డి హనుమంత్ రెడ్డి, మండల ఎన్నికల ఇంచార్జ్ కామసాని చెంగారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కె.విశ్వనాధ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోడిరెడ్డి గుణశేఖర్ రెడ్డి, బాలాజీ, యువమోక్ష అధ్యక్షులు తాతిరెడ్డి రామకృష్ణ రెడ్డి, ప్రధానకార్యదర్శి గుఱ్ఱం తిరుమల రెడ్డి, కిసాన్ మోక్ష అధ్యక్షులు డి. నరసింహారెడ్డి, ప్రధానకార్యదర్శి ప్రభాకరరెడ్డి, మహిళమోక్ష అధ్యక్షురాలు హిందూ మరియు భూతు అధ్యక్షులు పాల్గొన్నారు.