తాగేటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో టీడీపీ మద్దతుదారుల విజయం..
చైర్మన్గా ఎడవల్లి మార్తమ్మ.. వైస్ చైర్మన్గా మంగళ బాలకృష్ణ.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తా..విద్యా కమిటీ చైర్మన్ ఎడవల్లి మార్తమ్మ..
జలదంకి, అక్టోబర్ 03, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

జలదంకి మండలంలోని తాగేటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్గా ఎడవల్లి మార్తమ్మ, వైస్ చైర్మన్గా మంగళ బాలకృష్ణను ఎన్నుకున్నారు.కావలి విద్యాశాఖ అధికారి సీహెచ్. వెంకట సుబ్బయ్య, పాఠశాల హెచ్ఎం ఆర్.వి. రమాదేవి పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలిగిరి సీఐ పి. సుబ్బారావు, జలదంకి ఎస్ఐ గద్దె వీరేంద్రబాబు, కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐలు హరిబాబు, సుబ్బారావు పోలీస్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ ఎడవల్లి మార్తమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులను టీడీపీ నాయకులు గుర్రం ప్రవీణ్ బాబు, కొర్రపాటి రామారావు,మాజీ సర్పంచ్ మంగళ తిరుమల, ఇతర కూటమి నేతలు సన్మానించారు
