సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ కు శాశ్వత స్థానం!!సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం

ప్రేమచరిత్ర – కృష్ణ విజయం”సంక్రాంతి కానుకగా జనవరి 3 విడుదల!!

Mana Cinema:- సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం” రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్ లోపాల్గొన్న అతిధులు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం”. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్–సుహాసిని జంటగా నటించగా… నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు!!ఈ చిత్రం జనవరి 3, సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య, ప్రముఖ సాహితీవేత్త – గీత రచయిత బిక్కి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి వాసిరెడ్డి స్పందన, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్.మధుసూదన్, సహనిర్మాత ఎం. శంకర్ ఈ వేడుకలో పాల్గొన్నారు!!“ప్రేమచరిత్ర – కృష్ణ విజయం” కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్ పేరు సైతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు!!దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ… “సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని మధుసూదన్ ఆకాంక్షించారు!!ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్: శ్రీకాంత్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సహ నిర్మాతలు; బండ్రి నాగరాజ్ గుప్తా – బి.వెంకటేష్ శెట్టి – శ్రీపాద హన్ చాటే – ఎం. శంకర్, కథ -స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాణం – దర్శకత్వం: హెచ్. మధుసూదన్!!

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///