

మన న్యూస్:ఎల్ బి నగర్సం ధ్య థియేటర్ తొక్కిసలా ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమె మరణించడం బాధాకరం అని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం @అరణ్య భవన్ లో విలేకరుల సమావేశంలో అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ తల్లిని కోల్పోయాడు.ఆ భాద ఎన్ని కోట్లు ఇచ్చిన పూడ్చలేనిది.అల్లు అర్జున్ శ్రీతేజ చికిత్స తామే చేయిస్తున్నామని అబద్ధాలు మాట్లాడారన్నారు.ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది.భవిష్యత్తు లో ఏమైనా ఉన్న ప్రభుత్వమే చూసుకుంటుంది.అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.25 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామని అల్లు అర్జున్ అంటున్నారు.కానీ 10 లక్షలు మాత్రమే డీడీలు ఇచ్చారు.ఈ విషయంలో అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.అక్కడ చనిపోయిన కుటుంబం వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.వైశ్యులు అంటే ప్రతిపక్షాలకు చిన్న చూపు లాగా ఉంది.ఎన్నికల సమయంలో అవసరమా అయ్యే వైశ్యులు ఇలాంటి సమయంలో కనిపించకపోవడం బాధాకరం.
అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చిన బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు వైశ్యులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఆయా పార్టీలలో ఉన్న వైశ్యులు ఒకసారి పునరాలోచించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు కానీ అల్లు అర్జున్ పై ఎలాంటి పగ లేదని,అన్యాయం జరిగినా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.