దుత్తలూరు, సెప్టెంబర్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
దుత్తలూరు ఎస్సై సుభాషిని ఆధ్వర్యంలో దుత్తలూరు సెంటర్‌లో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కావలి డీఎస్పీ, ఉదయగిరి సీఐ, కలిగిరి సీఐ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఉదయగిరి సర్కిల్ ఎస్సైలు, వింజమూరు ఎస్సై, కావలి రూరల్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధారణ వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని అవగాహన కల్పించారు.హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
