తిరుపతి సెప్టెంబర్ 13. టీటీడీ ఉద్యోగుల సమస్యలను సీఎంఓ గ్రీవన్సెస్ నే . టీపీటీ 20260402576 మరియు టీపీటీ 20260212805 ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకెళ్లింది. ఉద్యోగుల ప్రధాన సమస్య అయిన పాదిరేడు అరణ్యం, పల్లం గృహ స్థలాల అభివృద్ధి సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడటంపై అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ హర్షం వ్యక్తం చేశారు.

టీటీడీ పాలకమండలి కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, నరేష్ కుమార్ సమస్యను సమగ్రంగా పరిశీలించి ముఖ్యమంత్రి కి నివేదిక అందించడం అభినందనీయమన్నారు. గృహ స్థలాలు త్వరితగతిన నివాసయోగ్యంగా మారేలా రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగుల గృహ స్థలాల అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కి, ఈవో ముద్దాడ రవిచంద్ర కి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి కి, జేఈవో లు డాక్టర్ శరత్ కి, ప్రభల గోపీనాథ్ కి, సీవీ మరియు ఎస్‌ఓ మురళీకృష్ణ కి, టీటీడీ పాలకమండలి సభ్యులకు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, టీటీడీ ఉద్యోగుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్, ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, కోశాధికారి గుంటూరు రేఖ, సునీల్ కుమార్ యాదవ్, శ్రీహరి చౌదరి, మణికంఠ, గంటా భరత్, ఈశ్వర్ నాయక్, రమాదేవి, ఈశ్వరయ్య, హర్ష, తేజేశ్వర్ రెడ్డి, రవి కుమార్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *