తిరుపతి: తిరుపతి శిల్పారామం అర్బన్ హాట్‌లో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ ఆధ్వర్యంలో ‘గాంధీ శిల్ప్ బజార్’ సెప్టెంబర్ 12న సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 12 నుండి 18 వరకు 7 రోజుల పాటు సాగనుండగా, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 40 మంది హస్తకళాకారులు, చేనేత కార్మికులు పాల్గొంటారు. మధ్యవర్తులు లేకుండా ఉత్పత్తులను నేరుగా విక్రయించి కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి శిల్పారామం చైర్‌పర్సన్ చెరెడ్డి మంజులా రెడ్డి అధ్యక్షత వహించనుండగా, మంత్రులు అనగాని సత్య ప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తదితరులు హాజరుకానున్నారు. ప్రజలు, కళాభిమానులు ఈ ప్రదర్శనను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *