గాజువాక మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 9:చిన్నగంట్యాడ అన్న క్యాంటీన్లో పరిశుభ్రతను పెంపొందించడం,వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం మరియు లబ్ధిదారుల సంతృప్తిని పెంపొందించడం అనే ముఖ్య ఉద్దేశ్యాలతో ఒక విజయవంతమైన ‘శిక్షణ మరియు సామర్థ్య పెంపుదల’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని మెఫ్మా టీమ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ధనుజయరావు మరియు హెచ్.కె.ఎమ్.సి.ఎఫ్ జోనల్ ఇన్ఛార్జ్ వి.ఎస్.కె.శర్మ క్యాంటీన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం ట్రైనింగ్ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనంతో పాటు,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన పారదర్శకతతో వడ్డెన జరగాలని చుట్టుపక్కల వాతావరణంతో పాటు పరిశుభ్రత కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఆర్ రవికుమార్ మరియు క్యాంటీన్ సిబ్బంది క్రియాశీలకంగా పాల్గొని తమ పూర్తి మద్దతును అందించారు.