నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తక్కెళ్లపాడులో పాఠశాల పక్కనే అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి బెల్ట్ షాపులను అడగాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వింజమూరు, సెప్టెంబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

పాఠశాల పక్కనే అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామంలో బెల్ట్‌ షాపుల నిర్వహణ రోజురోజుకూ పెరుగుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు కేవలం పది అడుగుల దూరంలోనే.. తక్కెళ్లపాడు ప్రభుత్వ పాఠశాలకు కేవలం పది అడుగుల దూరంలోనే బహిరంగంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.పాఠశాలకు వెళ్లే,చిన్నారులు,విద్యార్థులు నిత్యం మద్యం విక్రయాలు జరిగే ప్రాంతం గుండా వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సమీపంలోనే మద్యం విక్రయాలు సాగుతుండటంపై అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కూలీల కుటుంబాల్లో కల్లోలం.. గ్రామంలో ఎక్కువగా దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న కుటుంబాలే ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం మద్యం కోసం ఖర్చవుతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని మహిళలు వాపోతున్నారు. మద్యం సేవించి ఇంటికి వస్తున్న కొందరు కుటుంబ సభ్యుల కారణంగా ఇంట్లో గొడవలు, వేధింపులు పెరుగుతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిర్యాదులు చేసినా ఫలితం లేదంటున్న గ్రామస్తులు బెల్ట్‌ షాపుల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ,కొద్దిరోజులకే మళ్లీ మద్యం,విక్రయాలు,యథావిధిగాకొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.దీంతో తమ ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ పాఠశాల సమీపంలో మద్యం విక్రయాలు జరుగుతున్న అంశాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించాలని గ్రామస్తులు కోరుతున్నారు.తక్కెళ్లపాడులో అక్రమ మద్యం విక్రయాలపై సమగ్ర విచారణ చేపట్టి,నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కుటుంబాలను మద్యం మహమ్మారి నుంచి కాపాడాలని గ్రామ మహిళలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *