ఈ నెల 30వ తేదీన జరగనున్న తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎస్.వి. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లను నగరపాలక కమిషనర్ జయకృష్ణ ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. 30వ తేదీన జరగనున్న కౌంటింగ్ కు సంబంధించి కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం గుర్తించిన గదులను, కౌంటింగ్ సామాగ్రిని, ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి వార్డుకు కేటాయించిన టేబుల్స్, వార్డు నెంబర్, పీఎస్ నెంబర్ లతో నేలపై వేసిన మార్కింగ్ లు, భద్రత కోసం ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లు, ఫెన్సింగ్ లను పరిశీలించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, సర్వేయర్ గురువారెడ్డి, డీఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *