కొండాపురం, సెప్టెంబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కొండాపురం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు జడపల్లి మహేష్ అధ్యక్షతన మండల పదాధికారుల సమావేశం నిర్వహించారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శిపా రెడ్డి వంశీధర్ రెడ్డి సూచనలతో ఇకపై ప్రతి నెల 1వ తేదీన మండల పదాధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించారు.ప్రతి పంచాయతీ, ప్రతి బూత్‌లో “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి పంచాయతీ,ప్రతి బూత్‌లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చర్చించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బెల్లంకొండ మాల్యాద్రి, మండల ఉపాధ్యక్షులు శీలం మాల్యాద్రి, కార్యదర్శి కొండలరావు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మదన్, చిన్నకృష్ణయ్య, వెంగయ్యానాయుడు, బాలాజీ, సునీల్, వివేక్, కార్తీక్ తదితర నాయకులు, మండల పదాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *