*:జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్.వెంకటేశ్వర్*
తిరుపతి అక్టోబర్ 18: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జిల్లావ్యాప్తంగా మూడు రోజుల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు
మూడు రోజులు దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలు:
తిరుపతి మేయర్ స్థానానికి 36, వార్డు మెంబర్లుగా 449 నామినేషన్స్ దాఖలు
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా చివరి రోజైనా మూడవరోజు నామినేషన్ లలో భాగంగా మేయర్ స్థానానికి 36 నామినేషన్లు దాఖలు కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్ స్థానానికి దాఖలైన నామినేషన్ లలో బి.ఎస్.పి 2, సిపిఐ తరఫున 1, సిపిఎం తరపున 2, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున 1, టిడిపి నుండి 6, వైఎస్ఆర్సిపి నుండి 2, ఇతర పార్టీల నుండి 4, స్వతంత్ర అభ్యర్థులుగా 18, మొత్తం 36 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ స్థానాలకు 449 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇందులో టిడిపి నుండి 172, వైయస్ఆర్ సీపీ నుండి 87, జనసేన నుండి 67, బిజెపి నుండి 15, సిపిఐ నుండి 3, సిపిఎం నుండి 3, ఇతర పార్టీల నుండి 7, స్వతంత్ర అభ్యర్థులుగా 95, మొత్తం 449 నామినేషన్లు అందాయన్నారు.
సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి 10, వార్డు మెంబర్లుగా 162 నామినేషన్లు దాఖలు
32 వార్డులు గల సూళ్ళూరుపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి 2, టిడిపి నుండి 2, వై ఎస్ ఆర్ సి పి నుండి 5, స్వతంత్ర అభ్యర్థిగా 1 మొత్తం 10 నామినేషన్ లు దాఖలు కాగా, వార్డ్ మెంబర్ స్థానాలకు బిజేపి నుండి 7, సిపిఐ నుండి 3, సిపిఎం నుండి 1, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున 3, టిడిపి నుండి 65, వై ఎస్ ఆర్ సి పి నుండి 66, జనసేన నుండి 3, స్వతంత్ర్య అభ్యర్థులుగా 14, మొత్తం 162 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందన్నారు.
నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి 14, వార్డు మెంబర్లుగా 170 నామినేషన్లు దాఖలు
నాయుడుపేట మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి టిడిపి నుండి 3, వైఎస్ఆర్సిపి నుండి 5, బి ఎస్ పి నుండి 2, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి 1, స్వతంత్ర అభ్యర్థులుగా 3 మొత్తం 14 నామినేషన్ లు దాఖలు కాగా, 32 వార్డుల పరిధిలో బి జే పి నుండి 10, సిపిఎం నుండి 2, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి 2, టిడిపి నుండి 59, వై ఎస్ ఆర్ సి పి నుండి 81, జనసేన నుండి 3, స్వతంత్ర్య అభ్యర్థులు 13 మొత్తం 170 నామినేషన్లు దాఖలు చేశారన్నారు.
వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ స్థానానికి 9, వార్డ్ మెంబర్లుగా 216 నామినేషన్స్ దాఖలు
వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి బి ఎస్ పి తరఫున 2, టిడిపి తరఫున 3, వైఎస్ఆర్సిపి తరఫున 3, స్వతంత్ర అభ్యర్థులుగా 1, మొత్తం 9 నామినేషన్లు దాఖలు చేయగా, 36 వార్డుల పరిధిలో బిజెపి నుండి 4, సిపిఐ నుండి 1, సిపిఎం నుండి 1, టిడిపి నుండి 103, వైఎస్ఆర్సిపి నుండి 91, జనసేన నుండి 5, స్వతంత్ర అభ్యర్థులుగా 11, మొత్తం 216 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
పుత్తూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి 11, కార్పొరేటర్లుగా 263 నామినేషన్ దాఖలు
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి వై ఎస్ ఆర్ సి పి నుండి 7, టిడిపి నుండి 1, జనసేన నుండి 2, స్వతంత్ర అభ్యర్థుల నుండి 1 మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా, 36 వార్డుల పరిధిలో టిడిపి నుండి 123, వై ఎస్ ఆర్ సి పి నుండి 117, జనసేన నుండి 5, బిజెపి నుండి 4, సిపిఐ నుండి 3, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున 1, స్వతంత్ర అభ్యర్థుల నుండి 10 మొత్తం 263 నామినేషన్ లు దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
