మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆగస్టు 29 ,మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌ రిటైనింగ్‌ వాల్‌ మరమ్మతులకు రూ.83.50 లక్షలు, నర్వ పాత చెరువు పంట కాలువ మరమ్మతులకు రూ.48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నాయకులు, ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి సర్పంచులు రైతులు కలసి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగీతం, నర్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ గొట్టం నర్సింలు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగి రమేష్‌, సర్పంచులు సాయికిరణ్‌, భోయిని హరిన్‌కుమార్‌, కుమ్మరి రాములు, గజ్జెల జీవన్‌, నాయకులు మల్లయ్యగారి ఆకాష్‌, లోక్య నాయక్‌, సవాయి సింగ్‌, కాశయ్య, అథిక్‌, ఇఫ్తేకార్‌, రామగౌడ్‌, గోపి సింగ్‌, సాయ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *