మన ధ్యాస, మక్తల్: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిట్యాల గ్రామ సర్పంచ్ రహమత్ పాషా మొక్కలను నటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల గ్రామంలో మొక్కలను నాటడం జరిగిందనీ అన్నారు. నాటిన మొక్కల రక్షణ గ్రామ పౌరులందరు బాధ్యతగా తీసుకుని మొక్కలు ఎదిగే విదంగా కృషీ చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్, సెక్రటరీ మధు, ఫీల్డ్ అసిస్టెంట్ మైనోద్దిన్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *