బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20

రిపోర్టర్ కమల్ రెడ్డి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధిపై మంత్రికి సమగ్రంగా వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని విజయపతంలో నిలుపుతామని మంత్రికి తెలిపారు. బంగారుపాళ్యం మండల అభివృద్ధిపై మంత్రి లోకేష్ నుండి స్పష్టమైన హామీ లభించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు ధరణి ప్రసాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *